జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ ముఖ్య లక్ష్యం

July 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 05 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వ్యవస్థకు ఊపిరి వంటిది. అలాంటి జర్నలిజంను ఊపిరిగా భావించి జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజంలో అసమానతలు తొలగించి సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. జర్నలిస్టులు ఆర్ధికంగా వృత్తి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్నారు. అటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా నామమాత్రపు చేయూత మాత్రమే లభిస్తుంది. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ ముఖ్య లక్ష్యంగా ఆవిర్భవించిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జర్నలిస్టుల సమస్యలపై, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది.నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరపున అనేక కమిటీలు ఏర్పాటు చేసి జర్నలిస్టులకు, ప్రభుత్వాలకు ఒక వారధిలా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తోంది.స్మాల్ న్యూస్ పేపర్స్ వింగ్, న్యూ మీడియా వింగ్ (యూ ట్యూట్ వెబ్ సైట్స్), యూత్ వింగ్, ఉమెన్స్ వింగ్, అక్రిడిటేషన్ కమిటీ ఆర్టీఏ వింగ్ లీగల్ వింగ్ స్టడీ టీమ్ నిజ నిర్ధారణ కమిటీ హ్యూమన్ రైట్స్ వింగ్ సర్వే వింగ్ యాక్షన్ కమిటీ ఫిల్మ్ & టివి ఇండస్ట్రి వింగ్ ఆడిట్ వింగ్ లాంటి వివిధ కమిటీల రూపంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి జీవితాల్లో వెలుగులు చూడటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతుంది. అభివృద్ధి చెందిన మీడియా అవసరాలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత నేపథ్యంలో వెబ్సైట్లు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ నానాటికీ విస్తరిస్తున్నాయి ఒకప్పుడు కేవలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రమే పరిమితమైన జర్నలిజం నేడు వెబ్ మీడియాకు విస్తరించి తక్కువ సమయంలోనే తన ఉనికిని చాటుకున్నది.కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తించి న్యూ మీడియా పేరిట వెబ్సైట్లు (ఇంటర్నెట్ ఎడిషన్లు) యూట్యూబ్ ఛానళ్లను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా ఎంపానెల్మెంట్ చేస్తూ రేట్ కార్డులు జారీచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన న్యూ మీడియా మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన అన్ని వెబ్సైట్లు (ఇంటర్నెట్ ఎడిషన్లు) యూట్యూబ్ న్యూస్ ఛానళ్లను గుర్తించి వాటిల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు వీడియో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడంతో పాటు ఎంపానెల్మెంట్ రేట్ కార్డు) సదుపాయాన్ని కల్పించి “న్యూ మీడియా” కి ప్రోత్సాహం కల్పించాలి.జర్నలిస్టుల సమస్యలపై నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం) ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచుతుంది. *నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (టీ డబ్బులు జె ఎఫ్) డిమాండ్స్.*1. సంక్షేమ నిధితో కూడిన జర్నలిస్టు కార్పోరేషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించాలి. 2. జర్నలిస్టులపై దాడులు జరిగితే నాన్ బెయిలబుల్ వారెంట్ తో కూడిన కఠిన చట్టాలు తీసుకువచ్చి, జర్నలిస్టులపై దాడులు నివారణకు ప్రత్యేక చట్టం తో నిరోధక కమిటీ ఏర్పాటు చేయాలి.3. చిన్న తరహా, మధ్య తరహా, వార, పక్ష, మాస పత్రికలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రోత్సాహ నిధులను బడ్జెట్ లో కేటాయించాలి..4. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన “న్యూ మీడియా” మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన అన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ న్యూస్ చానళ్లను గుర్తించి వాటిలో పని చేస్తున్న జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు అక్రిటిటేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఎంపానెల్ మెంట్ (రేట్ కార్డు) సదుపాయం కల్పించాలి.5. చిన్న తరహా, మధ్య తరహా పత్రికలకు యాజమాన్య కార్యాలయాలకు స్థలం కేటాయించాలి..6. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యారంగంలో కూడా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను కల్పిస్తూ జీవో జారీ చేసి ఆచరణలో అమలు అయ్యేటట్లు చూడాలి..7. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలవబడే జర్నలిస్టులకు ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనం లాగే, వర్కింగ్ జర్నలిస్టులందరికి ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చి జర్నలిజం విలువను కాపాడాలి..8. విద్యారంగంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు జర్నలిజం గురించి ఒక చాప్టర్ పెట్టాలి.9. సమాజంలో జర్నలిస్టు అనే గొప్ప పేరు తప్ప, ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక సంక్షేమ పధకాలు అమలు చేయాలి.10. సీనియర్ జర్నలిస్టులకు, విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ తో కూడిన ఉపాధి కల్పించాలి.11. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు పరిమితిలేని (అన్ లిమిటెడ్) హెల్త్ కార్డులు ఇవ్వాలి.12. జర్నలిజం వృత్తిలో ఉపయోగించే కెమెరా, మొబైల్స్, ల్యాప్ టాప్స్, టూ వీలర్ వెహికల్స్, వివిధ వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వాలు ఆర్ధిక సహాయం అందించాలి..13. అర్హత కలిగిన జర్నలిస్టులందరికి రైల్వే పాసులు మంజూరు చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.. 14. జర్నలిస్టులందరికి ఉచిత వైద్యం మరియు ఉచిత ప్రమాద బీమా ప్రభుత్వం కల్పించాలి..15. జర్నలిస్టులందరికీ రాష్ట్ర మరియు జాతీయ రహదారులపై ఉచిత టోల్ ప్లాజా సౌకర్యం కల్పించాలి. 16. అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి..17. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పత్రికలకు ఇచ్చే ప్రకటనల్లో కనీసం 30 శాతం ప్రకటనలు చిన్న తరహా, మద్య తరహా, వార, పక్ష, మాస పత్రికలకు కేటాయించాలి..18. చిన్న తరహా, మధ్య తరహా, వార, పక్ష, మాస పత్రికలు ప్రింటింగ్ ప్రెస్ కొనుగోలుకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, దానికి కావాల్సిన స్థలం కేటాయించాలి.19. జర్నలిజం యూనివర్సిటీ ఏర్పాటు చేసి జర్నలిజం మూలాలకు ప్రోత్సాహం ఇవ్వాలి..20. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో జర్నలిస్టుల సమస్యలు కోసం ప్రత్యేక జర్నలిస్ట్ సెల్ ఏర్పాటు చేయాలి… ఈ సెల్ లో జర్నలిస్టులకు న్యాపరమైన, రక్షణ పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలి …21. జర్నలిస్టుల ఆత్మగౌరమైన అక్రిడిటేషన్ జారీలో చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టు లందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.22. చిన్న తరహా, మధ్యతరహా, వార, పక్ష, మాస పత్రికలకు జీఎస్టీ, ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేయాలి.పై డిమాండ్లపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము

🌐 Select Language:
📰 ePaper