పోలీస్ సంక్షేమానికి మరో ముందడుగు – అల్లాపూర్‌లో నూతన బ్యారక్స్ ప్రారంభం
జనం న్యూస్ జూలై 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది వసతి అవసరాల కోసం నూతనంగా నిర్మించిన మహిళా, పురుషుల బ్యారక్స్‌ను శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. యం. రమేష్ రెడ్డి ఐపీఎస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ డా. యం. రమేష్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా సేవలందించాలంటే వారికి మెరుగైన వసతి, సంక్షేమ సౌకర్యాలు కల్పించడం అత్యంత ముఖ్యమని అన్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ సంక్షేమం కోసం అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.నూతనంగా నిర్మించిన మహిళా, పురుషుల బ్యారక్స్ ద్వారా పోలీస్ సిబ్బందికి సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి అందుబాటులోకి వచ్చింది.అల్లాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పోలీస్ కమిషనర్ డా. యం. రమేష్ రెడ్డి ఐపీఎస్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటిరాజ్, ఐపీఎస్, ఏసీపీ పి. నరేష్ రెడ్డి, అల్లాపూర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.