అనంతసాగర్ సర్పంచ్ వెన్నెల దయాకర్‌కు సీఐ మహేందర్ ఘన సన్మానం

June 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామ సర్పంచ్ వెన్నెల దయాకర్‌ను హసన్‌పర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ ఘనంగా సన్మానించారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ మహేందర్ శాలువా కప్పి దయాకర్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మహేందర్ మాట్లాడుతూ, అనంతసాగర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి పోలీసు శాఖ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. సర్పంచ్ వెన్నెల దయాకర్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి పోలీసు శాఖ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.

🌐 Select Language:
📰 ePaper