ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి భద్రత,ఆరుతడి పంటల రక్షణ ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి

August 20, 2026 | తెలంగాణ

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వలసలు, ఆత్మహత్యలే మిగులుతాయి!

అన్ని రాజకీయ పార్టీలు, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి!

జనం న్యూస్ అనంతపురం ఆగస్టు 20 రిపోర్టర్ ముంగా ప్రదీప్ ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమలో త్రాగునీటి భద్రత, ఆరుతడి పంటల రక్షణ,రైతాంగ మనుగడకు ప్రభుత్వం తక్షణమే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ తో జల సంరక్షణ చర్యలు చేపట్టాలి. అందులకు అన్ని రాజకీయ పార్టీలు,సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతుల పంటలను కాపాడేందుకు, పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన అత్యవసర మైన అన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టాలి.వాటిని ఎక్కడికక్కడ రైతాంగానికి తెలియజేయాలి. రైతులను, చైతన్యపరచడంతో, పాటు, ప్రజా ప్రతినిధులు, సాగునీటి శాఖలను అప్రమత్తం చేయాలి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు శ్రీశైలం జలాల సంరక్షణ, రాయలసీమ ప్రాజెక్టులకు నీటి లభ్యత, త్రాగునీరు,ఆరుతడి పంటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అందించేందుకు నిరంతరం పర్యవేక్షణ చేయాలి ‌.ప్రభుత్వం, రాయలసీమకు ఉన్న నీటి హక్కులతో పాటు శ్రీశైలం జలాశయంలో నీటిని సాధ్యమైనంత మేరకు సంరక్షించి,రాయలసీమలోని ప్రతి ప్రాంతానికి సంబంధించిన సాగు,త్రాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నీటిని అందించేందుకు కార్యాచరణ చేపట్టాలి.తీవ్ర కరువు పరిస్థితుల్లో రాయలసీమ ప్రజల నీటి సమస్యను రాజకీయ ఎజెండాగా కాకుండా,ప్రజా సమస్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి.ప్రజా సమస్యపై స్పందిస్తున్న అన్ని రాజకీయ పార్టీలతో అన్ని జిల్లాలలో ఐఏబి నిర్వహించాలి. అయితే శ్రీశైలం జలాశయంలోకి వచ్చిన ప్రతి చుక్క నీటిని రాయలసీమ భవిష్యత్తు కోసం సంరక్షించాలి.ఈ కీలక సమయంలో, విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేసే విధానంపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి.విద్యుత్ ఉత్పత్తి కంటే త్రాగునీరు,రైతుల పంటల రక్షణ,పశువుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోకుండా తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. నీరు ఉన్నప్పుడే సంరక్షించాలి, నీరు ఉన్నప్పుడే రాయలసీమను కాపాడాలి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే, వలసలు,ఆత్మహత్యలే మిగులుతాయి.కె.వి రమణ,రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సిపి,అనంతపురం.

🌐 Select Language:
📰 ePaper