గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే పరిగిలో చత్రాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు

August 20, 2026 | వైరల్ వార్తలు

చత్రాజీ మల్టీ స్పెషాలిటీ ఎండి, డాక్టర్ రాజేందర్.

ఇక హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేదు అత్యవసర చికిత్సలకు మన పరిగిలోనే చత్రాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సలు

జనం న్యూస్ 20 ఆగస్టు వికారాబాద్ జిల్లా పరిగి గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ డబ్బుల ఖర్చుకే కార్పొరేట్ వైద్యం అందించాలని పరిగిలో చత్రాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి డాక్టర్ రాజేందర్ తెలిపారు. తాను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు వారికిమేజర్ వ్యాధులు రావడం వలన హైదరాబాద్ వెళ్లి హైదరాబాదులో కార్పొరేట్ ఆసుపత్రిల ఫీజులకు తట్టుకోలేక వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు కావున అది గమనించి గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకే మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే పరిగిలో మా నాన్న చిత్రాజి, ఆయన పేరు మీదనే చిత్రాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. సంవత్సర కాలంలో దాదాపు ఇప్పటివరకు వేయి వరకు సర్జరీలు చేయడం జరిగిందని ఒక బ్రెయిన్ సర్జరీ సైతం చేయడం జరిగిందని హైదరాబాదులో అందించే వైద్యం పరిగిలోనే అందించడం జరుగుతుందని ఆస్పత్రి ఎండి డాక్టర్ రాజేందర్ తెలిపారు. హైదరాబాదులో నిర్వహించే ప్రతి చికిత్స చత్రాజీ హాస్పిటల్ లో నిర్వహించేందుకు అందుకు సంబంధించిన సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని రోగికి ఎటువంటి పరిస్థితిలోనైనా శత్రాజీ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యం అందించడం జరుగుతుంది. అవసరమైతే చికిత్స చేయడం జరుగుతుందని ఆసుపత్రి ఎండి డాక్టర్ రాజేందర్ పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper