దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా
జనం న్యూస్ ఆగస్టు 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కె.పి.హెచ్.బి., మూసాపేట్, బాలానగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ పాల్గొని, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన విశిష్ట సేవలను గుర్తుచేసుకున్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.