పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడవద్దు-నోముల భగత్

August 20, 2026 | తెలంగాణ

జీవో 97 రద్దు కోరుతూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ ధర్నా

జనం న్యూస్ -ఆగస్టు 20- నాగార్జునసాగర్ టౌన్-రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ , ఏనుగుల రాకేష్ రెడ్డి,పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పైలాన్ కాలనీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి జెన్కో గెస్ట్ హౌస్ వరకు భారీ ర్యాలీగా వచ్చిమాచర్ల- హైదరాబాద్ ప్రధాన రహదారి పై బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, నోముల భగత్ మాట్లాడుతూ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి లేదా శక్తి డిపార్ట్మెంట్ లోకి విలీనం చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను క్రమంగా ప్రవేట్ వర్గాలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు, మూడేళ్ల డిప్లమా వ్యవస్థ దెబ్బతిని ఈ విలీనం వల్ల బీటెక్ నేరుగా చేరే ఈసెట్ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పాలిటెక్నిక్ విద్యార్థులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయకుండా కొత్త విధానాల పేరుతో పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.పాలిటెక్నిక్ విద్యార్థులు న్యాయమైన పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు, జీవో 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల హక్కులకు భంగం కలుగుతుందని వారి విద్యా ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు,జీవో 97 వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని, ప్రభుత్వం తక్షణమే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, హాలియా మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీనాయకులు, పెదవుర మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper