టీడీపీ నాయకుడు నంద్యాల వెంకన్నబాబు అంతిమ యాత్ర పాల్గొన్న ఎంపీ గంటి హరీష్ బాలయోగి
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)చెయ్యేరు: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ నంద్యాల వెంకటేశ్వరావు(వెంకన్న బాబు) అంతిమయాత్రను గురువారం నిర్వహించారు. అంతకుముందు వెంకన్న బాబు మృతదేహానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి వెంకన్న బాబు కడసారి యాత్రలో ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, కాట్రేనికోన టిడిపి మండల అధ్యక్షులు చెల్లి సురేష్, మాజీ అధ్యక్షుడు, మండల ఇంచార్జ్ దాట్ల పవన్, నడింపల్లి సుబ్బరాజు, మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు, విలేకర్ రాజు త టపల్లి నాగేంద్ర, నాగభూషణం, శ్రీనివాస్, నంద్యాల చంటి, బండారు ఏసు సుంకర నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.వెంకన్న బాబు సేవలను గుర్తు చేసుకుంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వెంకన్న బాబు మరణం టీడీపీ పార్టీకి తీరని లోటు అని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు.