అభివృద్ధి, సంక్షేమంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత : బండి రమేష్

August 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు, మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ అన్నారు. గాయత్రినగర్ డివిజన్, వివేకానందనగర్ కాలనీలో పుణ్యదంపతులు వేముల స్రవంతి, సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవార్లకు “సారే” పంపిణీ కార్యక్రమానికి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గాయత్రినగర్ డివిజన్ పరిధిలోని 11 దేవాలయాల్లో కొలువైన అమ్మవార్లకు వేముల సత్యం దంపతులు గాజులు, చీర, వేటపోతులు, ఇతర పూజా సామగ్రిని “సారే”గా సమర్పించారు.అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమని, ఆషాఢ మాసంలో ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న గొప్ప సంప్రదాయమని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వాటికి మరింత ప్రోత్సాహం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు బండి రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వేముల సత్యం దంపతులు, గాయత్రినగర్ డివిజన్ అధ్యక్షులు మస్తాన్ రెడ్డి, కనకయ్య, రాము, రమణ, వాసు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper