అల్లవరం మండలంలో బిఎల్ ఏ 2 ఓటర్ ఐడి సేకరణ
జనం న్యూస్ జూలై 21 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బిజెపి అధ్యక్షులు కట్ట నారాయణమూర్తి ఇంటి వద్ద సర్ అసెంబ్లీ కన్వీనర్ సంసాన్ వెంకటరత్నకుమార్ ఆధ్వర్యంలో బిఎల్ ఏ 2 తాలూకా ఓటర్ ఐడి నెంబర్ల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది.మండలంలోని 63 పోలింగ్ బూతులకు సంబంధించిన ఓటర్ ఐడి వివరాలను సేకరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేకాడి సత్యనారాయణ వర్మ పాల్గొన్నారు.