అల్లాపూర్ డివిజన్‌లో అధ్వానంగా మారిన రోడ్లు.. అధికారులను నిలదీసిన బండి రమేష్

August 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; ఈ బ్లాక్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి – సంబంధిత అధికారులకు ఆదేశం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఈరోజు అల్లాపూర్ డివిజన్‌లోని సఫ్దర్ నగర్ ప్రాంతంలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా నాలుగు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు గుర్తించిన సమస్యలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ బ్లాక్ రోడ్డు నిర్మాణంలో జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.వెంటనే కూకట్‌పల్లి జోన్ జిహెచ్ఎంసి అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన శ్రీ బండి రమేష్ రోడ్డు పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రారంభించాలని కోరారు. రోడ్డు పనులకు ఇప్పటికే నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంతో వర్షాకాలంలో ఈ బ్లాక్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.మంజీరా పైప్‌లైన్ పనులను సాకుగా చూపుతూ రోడ్డు పనులు నిలిపివేయడం సరికాదని, అవసరమైతే వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించి వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బండి రమేష్ పర్యటన సందర్భంగా స్థానిక కాలనీవాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల అవసరాలను బట్టి అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో అల్లాపూర్ వాజీద్ పాషా, అబ్దుల్లా, లక్ష్మణ్ గౌడ్, సాయి తులసి, రేష్మ, లక్ష్మి, రాము, రాంబాబు, శంకర్, నరసింహ, నరసింహ యాదవ్, వేణు, సతీష్‌తో పాటు స్థానిక కట్టమైసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper