ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి – బీజేవైఎం డిమాండ్

August 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగష్టు 04, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మెట్‌పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేవైఎం మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు గోపినవేణి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రూ.15,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రత్యేకంగా క్యూ ఆర్ (QR) కోడ్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే +91-8239523455 నంబర్‌కు మిస్ కాల్ ఇచ్చి ఉద్యమానికి మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణ, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు భీమనాతి విజయ్ కుమార్, గుండవేని శేఖర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కలిగోట శ్రీకాంత్, ఉపాధ్యక్షులు శంభోజి వివేక్, కనికరం ప్రవీణ్, కార్యదర్శి ఆరేటి పవన్ కుమార్, కోశాధికారి లోకిని గణేష్, అంగిడి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper