ఆకలి లేని ఏపీ నిర్మాణమే అన్న క్యాంటీన్ ల ధ్యేయం

June 24, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 24 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) [ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే అన్న క్యాంటీన్ ల ధ్యేయమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు కొనియాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కాట్రేనికోన అన్న క్యాంటీన్ ను ఆయన బుధవారం సందర్శించారు. పలువురితో మాట్లాడి భోజనం నాణ్యత గూర్చి అరాతీశారు. స్వయంగా భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం టోకెన్ల వారీగా ఆన్లైన్ వివరాలు పరిశీలించారు, సదరు సందర్శనలో మండల పరిషత్ జూనియర్ సహాయంకులు పృథ్వి, కాట్రేనికోన పంచాయతీ కార్యదర్శి జె వి సత్యన్నారాయణ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper