ఎం ఆర్ పి ఎస్ సర్వసభ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా గుత్తుల సాయి& గంధం పల్లంరాజు

June 22, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 22 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా నడిపూడి లో గల శ్రీ బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదిగల రాజకీయ భవిష్యత్ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో మాదిగలకు రాజకీయంగా గత 75 సంవత్సరాల నుండి తీరని అన్యాయం జరుగుతుందని ఈ జిల్లాలో మూడు ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎస్సీలకు రిజర్వేషన్ అవుతుంటే ఈ నాలుగు పదవులు ఎస్సీ లోని ఒకే సామాజిక వర్గమైన మా మాల సోదరులకే ఈ పదవులు ఇస్తున్నారని ఎన్డీఏ కూటమి విజయానికి కృషిచేసిన మాదిగలకు ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్త పరిచారు. 2024 ఎన్నికల సభలో ప్రస్తుతం ముఖ్యమంత్రివ నారా చంద్రబాబునాయుడు ఈ జిల్లాలో నాలుగు స్థానాలు కొన్ని కారణాల వలన ఎస్సీ లో ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిన నందున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగ లకు ఈ జిల్లా నుండి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ నుండి ఎంపీటీసీ ఎంపీపీ జడ్పిటిసి స్థానంలో ఎస్సీ లో మాదిరిగా రావలసిన వాటా ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి మాదిగ మహా కూటమి జేఏసీ కన్వీనర్ ఆకుమర్తి ఆశీర్వాదం అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు గారు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గంపల సత్యప్రసాద్ చుట్టు గుల్ల నీలకంఠం యార్లగడ్డ సత్తిబాబు సవరపు భైరవమూర్తి పెదపూడి రుక్మిణి చుట్టుగుల కిషోర్ మల్లవరపు సత్తిబాబు మల్లవరపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper