మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి- ఎస్సై సతీష్
సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు
జనం న్యూస్- జూన్ 22- నాగార్జునసాగర్ టౌన్- యువత విద్యార్థులు మాదకద్రవ్యాల (డ్రగ్స్) భారీన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజయపురి టౌన్ ఎస్సై సతీష్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా స్థానిక సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెడు అలవాట్లకు క్షనికానందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని సూచించారు, మాదకద్రవ్యాల రవాణా వినియోగాలు చట్టరీత్యా నేరమని పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని విద్యార్థులకు వివరించారు, ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.సమాజంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్న ,సరఫరా చేస్తున్న లేదా వాడుతున్న ఈ సమాచారాన్ని 1908 టోల్ ఫ్రీ నెంబర్ మాదకద్రవ్యాలు ( డ్రగ్స్) నిరోధక హెల్ప్ లైన్ సెంటర్ కు అందించాలని, సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయని , ఈ హెల్ప్ లైన్ నెంబర్ ను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ నెంబర్ ను నడుపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.