ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు జన్మదిన సందర్భంగా విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ –

July 6, 2026 | వైరల్ వార్తలు

బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్, యువ నాయకుడు సాహిల్ షెట్కర్ నోట్ బుక్ పంపిణీ

బిచ్కుంద జూలై 6 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సీమ షెట్కర్ , యువ నాయకుడు సాహిల్ షెట్కర్ తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన నోట్‌బుక్స్‌ను విద్యార్థినులకు అందించి విద్య పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం గొప్ప సామాజిక బాధ్యత అని, విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదినాలు, ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని అన్నారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు అభినందించారు. సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని జరుపుకోవడం సమాజానికి ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు

🌐 Select Language:
📰 ePaper