ఏర్గట్లలోఘనంగాజయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి
ఏర్గట్ల, ఆగస్టు 6 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటిస్తూ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బట్టాపూర్ ఉప సర్పంచ్ ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకం చిరస్మరణీయమని అన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం గద్దర్ తన జీవితాన్ని అంకితం చేసి పాటల ద్వారా చైతన్యం నింపారని కొనియాడారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు జంగాల గణేష్, బాబులు, రాజా గంగారం, మల్లన్న, మన్నన్, పత్రి రాజు, జోగు నరసయ్య, పత్రి నరసయ్య, దొబ్బల రాజేష్, బాలగంగాధర్, జంగాల పెద్ద గంగారం, జంగాల గంగాధర్, టెంటు రాము, మతిన్, ఇష్మాయిల్ తదితరులు పాల్గొన్నారు