ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలి – బండి రమేష్

July 23, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గంలోని గాయత్రి నగర్, పర్వత్ నగర్ డివిజన్లలో నిర్వహించిన ఎస్‌ఆర్‌ఐ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పరిశీలించి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా కృషి చేయాలని కోరారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఓటరికి ఆ హక్కు వినియోగించే అవకాశం కల్పించాల్సిన బాధ్యత మనందరిదేనని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణ, తొలగింపులు వంటి అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి సహాయం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి అర్హులైన ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేస్తుందని బండి రమేష్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము వేణు, మస్తాన్ రెడ్డి, వేముల సత్యం, కనకయ్య రాజు, సేవాదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper