కమిషన్ల కోసమే డబుల్ బెడ్ ఇళ్లు: శివన్నోళ్ల శివకుమార్

August 6, 2026 | వైరల్ వార్తలు

ఏర్గట్ల, ఆగస్టు 6 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను ఆనాటి ప్రభుత్వం కమిషన్ల కోసమే చేపట్టిందని, పేదలకు ఇళ్లు అందించాలనే చిత్తశుద్ధి అప్పటి ప్రభుత్వానికి లేదని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ ఆరోపించారు.గురువారం ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి హయాంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని విమర్శించారు.మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాంట్రాక్టర్‌కు సుమారు 95 శాతం బిల్లులు చెల్లించినప్పటికీ, పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించారు. నాణ్యత లేని నిర్మాణాలతో ప్రజాధనాన్ని వృథా చేశారని, అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లను పూర్తి చేయని వారు ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని నిధులు కేటాయించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలల్లో ఏర్గట్ల మండలంలో సుమారు 500 మంది అర్హులకు ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించిందన్నారు. ఇప్పటికే అనేక ఇళ్లు పూర్తై లబ్ధిదారులు నివాసం ఉంటుండగా, మిగిలిన ఇళ్ల నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో వాటిని పూర్తి చేసి, మరో 500కు పైగా అర్హులైన కుటుంబాలకు కూడా ఇళ్లను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper