తాసిల్దార్ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

August 6, 2026 | తెలంగాణ

బిచ్కుంద ఆగస్టు 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92 వ జయంతి వేడుకలు తాసిల్దార్ వేణుగోపాల్ ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ ని వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. .ఈ కార్యక్రమంలో తాసిల్దారు తో పాటు రెవిన్యూ ఇన్స్పెక్టర్ అంజు మరియు శేఖర్ కుశాల్ పటేల్ రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper