కలెక్టరేట్ వద్ద మెడికల్ షాప్ వర్తక సంఘంల నిరసన

May 20, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ మే 20 కాట్రేని కోన ప్రతినిధి దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ జరుగుతున్న సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మసీలు రద్దు చేయాలని నకిలీ మందులు అమ్ముతూ అనైతిక డిస్కౌంట్ విధానం జి ఎస్ ఆర్ 220 రద్దు చేయాలని జిఎస్ఆర్ 817 రద్దు చేయాలని వారి యొక్క డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం కలెక్టర్ కి అందించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ వి ఎస్ శ్రీనివాస్ రావు జిల్లా కార్యదర్శి వి వి ఎస్ ఎన్ మూర్తి, కొమ్మూరి వీసిహెచ్ ప్రసాద్ ట్రెజరర్ ఏ ఎస్ వి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు మోకా వెంకట సుబ్బారావు, తటవర్తి నాగేశ్వరరావు కేశవ కృష్ణ శిరగం వెంకటేశ్వరరావు, రెడ్డి నాయుడు, కాళ్లకూరి కృష్ణ, కొమ్మూరి వి సుబ్బారావు మరియు కెమిస్ట్రీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper