కాంగ్రెస్ ది ప్రజా సంక్షేమ పాలన : తోట అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

September 5, 2026 | తెలంగాణ

♦️ వెయ్యి రోజుల ప్రగతి పాలన నివేదిక కార్యక్రమం

♦️రుద్రూర్ లో భారీ ర్యాలీ

♦️ వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు.

జనం న్యూస్ 5 సెప్టెంబర్ 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా.వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి అయిన సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలో వెయ్యి రోజులు ప్రగతి పాలన నివేదిక కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంచి పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ జెండాలు చేతబుని మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోట అరుణ్ కుమార్ మాట్లాడుతూ వెయ్యి రోజుల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి,అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించడమే కాకుండా, సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదల ఆకలి తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కులగణన చేపట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కొండల్ వాడి శంకర్,రాంబాబు,గోంటి సాయిలు, ఉపసర్పంచ్ షేక్ నిస్సార్,షాదుల్లా, నాయకులు కూనిపూర్ రాజి రెడ్ది,కర్కే అశోక్,పత్తి రాము,తోట సంగయ్య,నడిపింటి నగేష్, అక్కపల్లి నాగేందర్, పట్టేపు రాములు, ఎంజీఆర్, నేరుగంటి బాలరాజు, అనిల్ పటేల్,నితీన్ పటేల్, పోతురాజు లింగం, పార్వతి ప్రవీణ్, షేక్ ఖాదర్, షేక్ సుభాని, ఇమ్రాన్ కురేషి,ఖాజా కురేషి,జమీల్,జమీల్ కురేషి,షేక్ షాదుల్,సిద్దాపూర్ లక్ష్మణ్, దువ్వ రవి కుమార్, సుదర్శన్ గౌడ్,జింక సాయిలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper