కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు కట్టుబడి ఉంది : బండి రమేష్
జనం న్యూస్ మే 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ లక్ష్మికళ సినిమా హాల్ సమీపంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన ఆలయ కమిటీ చైర్మన్‌గా రాచమల్ల బిక్షపతి గౌడ్, కమిటీ సభ్యులుగా కావాలి పాండు, ఎం. రమేష్, మెట్టు వినోద్, పి. నర్సింగ్ రావు, నోముల బాబురావులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన బండి రమేష్ గతంలో చిన్న గుడిగా ఉన్న శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన మాజీ కౌన్సిలర్ తూము ఎల్లారావు ని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.అమ్మవారి ఆశీస్సులు గ్రామంలోని ప్రతి కుటుంబంపై ఉండి అందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో, అభివృద్ధితో ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. ఆలయ కమిటీ బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ఆలయం అనేది కేవలం పూజలు జరిగే స్థలం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. అలాంటి పవిత్ర ఆలయ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన మీరు అందరూ గ్రామ ప్రజలను కలుపుకొని ఆలయ గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. భక్తి భావంతో, సేవా దృక్పథంతో పనిచేస్తూ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, దేవాలయాల పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, అలాంటి పార్టీకి ప్రతి ఒక్కరూ బలంగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, ఏ బ్లాక్ అధ్యక్షులు పటోళ్ల నాగిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, గాలి బాలాజీ , కోపిశెట్టి దినేష్ కుమార్ ,గంధం రాజు,నియోజకవర్గ ఓబీసీ అధ్యక్షులు తూము సంతోష్, రాచమల్ల శేఖర్ గౌడ్ తదితరులతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.