కురుమ కల ఆత్మ గౌరవానికి చిరస్మరణీయుడు ప్రతీకగా నిలిచిన కీర్తిశేషులు కొమురయ్య 5 వ వర్ధంతి
జనం న్యూస్ మే 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కురుమ కుల ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచిన పెద్దకోడెపాక గ్రామ పట్నాల ఆచారం పెద్దమనిషి కీర్తిశేషులు అన్న కొమురయ్య 5వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా వారి చిన్న కుమారుడు అన్న మహేందర్ తమ తండ్రి స్మారకార్థంగా గ్రామాభివృద్ధికి తోడ్పడే మహోన్నత సంకల్పంతో గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.25,000/- విలువైన చెక్కును గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు అందజేయడం జరిగింది.సమాజ సేవ పట్ల ఉన్న అంకితభావంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చే ఇలాంటి సేవామూర్తుల ఆలోచనలు సమాజానికి స్ఫూర్తినిస్తూ, గ్రామ ప్రగతికి బాటలు వేస్తున్నాయి.పెద్దకొడపాక గ్రామ సర్పంచ్ మంద దీనా ప్రభాకర్ పట్నాల ఆచారం పెద్దమనిషి కీర్తిశేషులు అన్న కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి సేవలు, ఆశయాలు, సమాజం పట్ల చూపిన అంకితభావం ఎల్లప్పుడూ మనందరికీ మార్గ దర్శకం గా నిలుస్తాయి. ఈ సందర్భంగా వారి చిన్న కుమారుడు అన్న మహేందర్ మాట్లాడుతూ మా తండ్రి జ్ఞాపకార్థంగా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, గ్రామాభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను” అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుకు సాగడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వార్డు సభ్యులు శివ సుమన్, రఘుపతి, గణేష్ కురుమ కుల పెద్దమనిషి అమ్మ రాజు, బీరన్న ఆలయ కమిటీ చైర్మన్ ముజిగిరి వేణు కుల పెద్దలు, గ్రామ పెద్దలు శ్రీనివాస్, అమ్మ అశోక్ చంద్రమౌళి పాల్గొన్నారు….