కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఆగస్ట్15 డెడ్లైన్.ఆలస్యం చేస్తే సిలండర్ సరఫరాలో ఇబ్బందులు
జనం న్యూస్ ఆగస్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం నకిలీ,డబుల్ కనెక్షన్లను అరికట్టడానికి ఈ కేవైసీ అర్హులైన లబ్ధిదారులకే నేరుగా ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు చేరేలా చూడడంభారత్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ దోబ్లే సాహిల్ పురుషోత్తం అన్నారుశాయంపేట మండలంలోని గ్యాస్ సబ్సిడీ, సరఫరా సంబంధిత సేవలు నిరంతరంగా కొనసాగాలంటే గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా తమ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని భారత్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ దోబ్లే సాహిల్ పురుషోత్తం సూచించారు. అందుకు ఈ ఆగస్ట్ 15 తేదితో ముగుస్తుందన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని ఆరేపల్లి గ్రామ శివారులో గల ఆదిరెడ్డి భారత్ గ్యాస్ ఏజెన్సీలో మంగళవారం భారత్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ దోబ్లే సాహిల్ పురుషోత్తం ఈకేవైసీలపై రిపోర్టును పరిశీలించారు. ఎంత మేర కేవైసీ చేసుకున్నారు. ఇంకా ఎంత పెండింగ్ ఉంది అనేదిదానిపై ఆరా తీసారు. కేవైసీ చేయించుకోని వారికి ఎట్టి పరిస్థితుల్లో సిలండర్లు డెలవరీ చేయద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది గ్యాస్ కనెక్షన్లు నకిలీ పేర్లతో, లేదా మరణించిన వారి పేర్లతో చెలామణి అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఒకే కుటుంబంలో బహుళ కనెక్షన్లు ఉండటం, డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్ అవసరాలకు మళ్లించడం వంటి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీని అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుందన్నారు. దీనిద్వారా అర్హులైన నిజమైన లబ్ధిదారుల ఖాతాల్లోనే సబ్సిడీ జమ అయ్యేలా చూడొచ్చని భావిస్తోంది. ముఖ్యంగా పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇది అత్యంత కీలకం. గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులందరూ తప్పనిసరిగా తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు స్పష్టం చేశాయన్నారు. గడువులోగా కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ ఆగిపోయే ప్రమాదంతో పాటు కనెక్షన్ తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులతో పాటు సాధారణ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులందరూ ఈ కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఒకే పేరు మీద ఉన్న నకిలీ,డబుల్ కనెక్షన్లను అరికట్టడడంతో పాటు అర్హులైన నిజమైన లబ్ధిదారులకే నేరుగా ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు చేరేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ-కేవైసీ అంటే గ్యాస్ ఏజెన్సీల ముందు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చమురు సంస్థలు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చాయన్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక యాప్‌లను వినియోగించుకుని కేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. భారత్ గ్యాస్ కస్టమర్లు హలో బీపీసీఎల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆధార్ ఫేస్ ఆర్ డి యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకుని, ఫేస్ అథెంటికేషన్ ద్వారా నిమిషాల్లో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. స్మార్ట్‌ఫోన్ లేని వారు, లేదా యాప్స్ వాడటం రాని వారు నేరుగా తమ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా పూర్తి చేయవచ్చు. వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ పాస్ బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్లాలి అన్నారు. అంతేకాకుండా సిలిండర్ డెలివరీ చేసే బాయ్స్ వద్ద ఉండే ప్రత్యేక యాప్ ద్వారా కూడా ఇంటి వద్దే ఈ-కేవైసీని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చన్నారు. అనంతరం గ్యాస్ డిస్ర్టీబ్యూటర్ దుంపల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ..కస్టమర్లు కేవైసీ చేసుకునేందుకు చివరి నిమిషం వరకు వేచి చూడద్దన్నారు. రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వెంటనే మీ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలని సూచించారు. గడువు సమీపిస్తున్న కొద్దీ సర్వర్ల మీద ఒత్తిడి పెరిగి సైట్లు క్రాష్ అయ్యే అవకాశాలు, ఏజెన్సీల వద్ద రద్దీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 15వ తేదీ వరకు వేచి చూడకుండా, వీలైనంత త్వరగా ఈ-కేవైసీని పూర్తి చేసి సబ్సిడీ ఆగిపోయే ముప్పును తప్పించుకోవాలని సూచించారు…..