జోరుగా అక్రమ నిర్మాణాలు.. అధికారుల మౌనం వివాదాస్పదంకెపిహెచ్బీ డివిజన్లో అదనపు అంతస్తుల నిర్మాణాలపై స్థానికుల ఆగ్రహం – వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
జనం న్యూస్ | ఆగస్టు 4 | తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డిమూసాపేట సర్కిల్ పరిధిలోని కెపిహెచ్బీ డివిజన్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్మాణదారులు నిబంధనలను బేఖాతరు చేస్తూ అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.డివిజన్ పరిధిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత మాత్రమే అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు జారీ చేయడం, అనంతరం కూల్చివేతలకు దిగడం వల్ల ప్రభుత్వానికి, నిర్మాణ యజమానులకు నష్టం వాటిల్లుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా కెపిహెచ్బీ డివిజన్లోని విశ్వంభర కాలనీలో ఓ నిర్మాణదారుడు అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో నిర్మాణదారుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని వారు పేర్కొన్నారు.నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతతో పాటు పట్టణ ప్రణాళికా నిబంధనలను పరిరక్షించాలంటే అధికారుల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు