కొత్తూరు బి గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి: గ్రామ నాయకుల డిమాండ్

July 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : జహీరాబాద్ నియోజకవర్గంలోని కొత్తూరు బి గ్రామంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునః ప్రారంభించాలని గ్రామ సర్పంచ్ నాగూర్ మల్లికార్జున్ పటేల్, రమేష్ రెడ్డి, అమృత్, బండి విలాస్, బాబన్న తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైతే వేలాది మంది కార్మికులు, చెరకు రైతులు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కూడా గ్రామ నాయకుల డిమాండ్‌కు మద్దతు తెలుపుతూ, ఆలస్యం చేయకుండా ఫ్యాక్టరీని తెరవాలని విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper