గద్వాల.క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
జనం న్యూస్ 27 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం లో బ్లాస్టింగ్ వల్ల బోరు నష్టపోయిన రైతుకు పరిహారం ఇప్పించాలి.దుమ్ము వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలి సి పి యం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి గట్టు మండలం సల్కాపురం గ్రామ శివారులో మెగా కంపెనీ వారు భారత్ మాల రోడ్డు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కంకర క్రషర్ మిషన్ వల్ల చుట్టు పక్కల పంటపొలాలు దుమ్ము, ధూళి తో నిండిపోయి రైతులు పంటలు నష్టపోతున్నారని,కంకరకోసం పక్కన ఉన్న జోగన్ గట్టు గుట్టలో పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ పెట్టీ పగలగొడుతున్నారని,బ్లాస్టింగ్ శబ్దానికి భూమి కంపించి పక్కన సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు కు చెందిన వ్యవసాయ పొలంలో గత రెండు సంవత్సరాల క్రితం బోరు మోటార్ భూమిలో కుంగి పోయిందని ఇట్టి విషయమై క్రషర్ కంపెనీ యాజమాన్యానికి ఆ రైతు గత సంవత్సర కాలంగా పిర్యాదులు చేసినా పట్టించు కోవడం లేదని,బోరు మునిగి పోవడము నీరు లేక మూడు ఎకరాల భూమి బీడుగా మారడము చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం వల్ల రైతు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడని యేసు ఆత్మహత్యా యత్నానికి క్రషర్ కంపెనీ యాజమాన్యమే కారణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతున్న సల్కాపురం గ్రామానికి చెందిన రైతు ఏసును బుధవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి నందు సి పి యం జిల్లా కమిటీ బృందం పరామర్శించింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతు రైతు ఏసుకు జరిగిన నష్టానికి కారణం క్రషర్ కంపెనీ యాజమాన్యమేనని బోరు మోటార్ కు మరియు పంట నష్టానికి పూర్తిగా పరిహారం క్రషర్ కంపెనీ యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రషర్ నిర్వహణకు గుట్టల్లో రాళ్లు తీసుకోవడానికి దుమ్ము ధూళి పంట పొలాలు గ్రామాల్లోకి వస్తున్నందుకు వీటన్నింటికీ ప్రభుత్వ అనుమతులు జిల్లా అధికారులు పరిశీలించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు ఏసుకు పూర్తిగా నష్టపరిహారం కంపెనీతో ఇప్పించాలని డిమాండ్ చేశారు.హాస్పటల్లో రైతును పరామర్శించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాసు,వివి.నరసింహ ఉన్నారు.వెంకటస్వామి సి పి యం జిల్లా కార్యదర్శి జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ