చౌడమ్మ దేవాలయ నిర్మాణానికి రాతి కడప పూజ
జనం న్యూస్ :6 సెప్టెంబర్ ఆదివారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: సిద్దిపేట పట్టణంలోని అతి పురాతనమైన చౌడమ్మ దేవాలయం నిర్మాణంలో భాగంగా పురోహితులు నాగరాజు శర్మ రాతి కడప పూజచేశారు. ఈ సందర్భంగా నాగరాజుశర్మ మాట్లాడుతూ యాదవుల దైవమైన శ్రీకృష్ణుడు, మల్లికార్జునస్వామితో పాటుగా చౌడలమ్మ దేవాలయాలు నిర్మాణం కావడం సంతోషమన్నారు. యాదవుల ఐక్యతతో ఉండి, దేవాలయ నిర్మాణం చేస్తున్నందుకు సంతోషించారు. పయ్యావుల ఎల్లం యాదవ్, దుబ్బ రాజుయాదవ్, కవి ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రామ్ యాదవ్, తిరుపతి యాదవ్, నర్సింగ్ యాదవ్, లింగం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్,యాదవ మహిళలు తదితరులు పాల్గొన్నారు