జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యా భారతి స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలుఉపాధ్యాయుల సేవలు మరువలేనివి: ప్రిన్సిపల్ కృష్ణారెడ్డిజహీరాబాద్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 5. 09. 2026నియోజకవర్గంలోని విద్యా భారతి పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ గురువులకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల తమకున్న గౌరవం, అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తూ, విద్యతో పాటు మంచి విలువలు నేర్పడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అందించే జ్ఞానం, క్రమశిక్షణ, స్ఫూర్తి విద్యార్థుల జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. విద్యార్థులు కూడా తమ ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
