జీలుగా విత్తనాల పంపిణీ
జనం న్యూస్ 20మే పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి రైతు వేదికలో ఖరీఫ్ సీజన్లో విత్తనాలకు ముందు వేసి కలియ దున్నే జీలుగా విత్తనాలను ఏవో శ్రీకాంత్ తో కలిసి పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ జన్మముజీలుగా విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వీటి ద్వారా నత్రజని భూసారం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ లింగంపల్లి మహేష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి తిరుపతి నాయకులు పురుషోత్తం అనిల్ గౌడ్ ముదిగంటి పవన్ రెడ్డి సంధి మల్లారెడ్డి కుంచ రాజేందర్ ఆరెల్లి స్వామి పలువురు నాయకులు పాల్గొన్నారు.