జూలై 1న జరిగే టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణను విజయవంతం చేయండి
జనం న్యూస్ 29 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : విలేకరుల సమావేశంలో ప్రకటనను విడుదల చేసిన విష్ణు నాయుడు లవన్న టిఆర్ఎస్ పార్టీ మల్దకల్ మండల నాయకులు మల్దకల్: జూలై 1న బుధవారం రోజున మల్దకల్ మండల కేంద్రంలోని గాంధీ చౌకు నందు (తెలంగాణ రక్షణ సేన) టిఆర్ఎస్ పార్టీ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దీనికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ హాజరు కాబోతున్నారని టిఆర్ఎస్ పార్టీ మల్దకల్ మండల నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక తెలంగాణనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల తరఫున (తెలంగాణ రక్షణ సేన) టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతుందని, సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. జూలై 1న మల్దకల్ మండల కేంద్రంలోని గాంధీ చౌకు వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ అడివిరాల చెరువు సర్పంచ్ కృష్ణ తెలంగాణ రక్షణ సేన నాయకులు నజముల్లా గోపాల్ ,ఉప్పరి కృష్ణ హనుమేష్ బంగి పరీక్ష బలిజరాజు మీసాల కృష్ణ గార్లపాడు లక్ష్మన్న తిరుపతన్న బీసన్న సుదర్శన్ రోషన్న కెపిఆర్ సత్యం గోకారి శాంతిరాజు లక్ష్మన్న ఆశన్న భూపతి నాయుడు నేతన్న గొర్ల తిమ్మప్ప రాముడు రమేష్ శేఖర్ అంజి తదితరులు పాల్గొన్నారు