డిడిఓ ఆకస్మిక సందర్శన … కార్యక్రమాలపై సమీక్ష

May 21, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలా పురం డివిజ నల్ అభివృద్ధి అధికారి పి విజయభాస్కర్ బుధ వారం కాట్రేనికోన మండల కేంద్రాన్ని ఆక స్మిక సందర్శన చేశారు. కాట్రేనికోన : గ్రామ పంచాయతీలో “చెత్త నుండి సంపద తయారీ కేంద్రం” పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతీ బుధవారం నిర్వహించే ‘స్వచ్ఛ పదం” కార్యక్ర మంలో ఆయన భాగస్వామ్యం అయ్యారు. సందర్భంగా డిడిఓ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్్న వినియోగించవద్దని హితవు చెప్పారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్శనలో ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు, డిప్యూటీ ఎంపీడీఓ(పిఆర్) ఎన్ శంకర నారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ (ఎస్టిఎస్ఈబ్ల్యు) ఎస్ సూర్య నారాయణరాజు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper