డిసిసి బ్యాంకు పొదుపు డిపాజిట్ లపై ప్రజలకు అవగాహన

జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేటగ మండలంలోని గోవిందా పురం గ్రామ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామ సర్పంచ్ దాసి స్వాతి- శ్రావణ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం డిసిసి బ్యాంక్ ఆత్మకూర్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పొదుపు యొక్క ప్రాముఖ్యత, రుద్రమదేవి డిపాజిట్ పథకం, బ్యాంకు ఖాతా సౌకర్యాలు, ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ స్కీమ్స్, బ్యాంకు ద్వారా లభించే వివిధ రుణాల సద్వినియోగం, తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం వలన లాభాలు, క్రెడిట్ క్రమశిక్షణ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, సైబర్ భద్రత గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ హరిత, శాయంపేట పిఎసిఎస్ సీఈఓ మోహన్, బ్యాంకు సిబ్బంది, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.