బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య అక్రమ అరెస్ట్

జనం న్యూస్ 14 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం అక్రమ అరెస్ట్ లతో ప్రజా పాలనను కొనసాగించలేరు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆలంపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్బంగా అడ్డుకుంటారు అనే నెపం తో..ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్న పాపానికి ఐజ పట్టణంలో ముందస్తుగా అరెస్ట్ చేసి ఐజ పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య ను తరలించారు