(డి సి హెచ్ ఎస్) డాక్టర్ హిమదేవి కి హెచ్ఆర్ పిసిఐ జాతీయ “ఉత్తమ సేవా రత్న” అవార్డు.

July 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.హెచ్ ఆర్ పి సి ఐ కడప జిల్లా చైర్మన్ డాక్టర్ వి డేవిడ్ చేతులు మీదుగా.హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు తాళ్లూరి ప్రసన్న కుమార్ సూచనల మేరకు.వైద్య రంగంలో విశిష్ట సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన మౌలిక వసతుల కల్పన అలానే నిరంతర పర్యవేక్షణకు గాను, వైఎస్ఆర్ కడప జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త హిమ దేవి కి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ‘ఉత్తమ సేవా రత్న’ పుర స్కారంతో సత్కరించింది.ఈ అవార్డు రావడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంటల్, వైద్యులు అలానే సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. హిమ దేవి కి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక అభినంద నలు తెలిపారు.ఈ కార్య క్రమంలో పాల్గొన్న కడప జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణ్ రాజు, హెచ్ ఆర్ పి సి ఐ జిల్లా వర్కింగ్ కమిటీ చైర్మన్ మంచాల చిన్న చెన్నయ్య, కడప మండల అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్, గిలక రవి కిషోర్, అలాగే కార్యాలయ సిబ్బందిపాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper