తెలంగాణ సాధనలో జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం బండి రమేష్

July 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జులై 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేషంగా కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి శ్రీ జైపాల్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా కూకట్‌పల్లి ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. బాలానగర్ వెంకటేశ్వర్ నగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌లో తనదైన శైలిలో బలంగా గళం విప్పారని అన్నారు. అపారమైన రాజకీయ అనుభవం, విశ్లేషణా సామర్థ్యంతో దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన నిజమైన ప్రజానాయకుడని కొనియాడారు. రాజకీయ చతురుడిగా, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన జైపాల్ రెడ్డి ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా చాకచక్యంగా పరిష్కార మార్గాన్ని చూపే నాయకుడని పేర్కొన్నారు.తెలంగాణ ఆకాంక్షను జాతీయ స్థాయిలో బలంగా వినిపించడంలో, రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించడంలో జైపాల్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైందని బండి రమేష్ గుర్తు చేశారు. ఆయన ప్రజాసేవ, రాజకీయ విలువలు, నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, తూము సంతోష్, పులి శివగౌడ్, చంద్ర, నాగార్జున, క్రాంతి, నర్సింగ్, రాము, రమణ, జ్యోతి, శ్రీనివాస్, పార్వతి, ముస్తఫా తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జైపాల్ రెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు.

🌐 Select Language:
📰 ePaper