తోటి మిత్రురాలిని పరామర్శించిన 1996-97 లో చదువుకున్నా మిత్రులు

August 11, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అండగా నిలుస్తాం!20 ఏళ్లుగా ఆపదలో ఉన్న తోటి మిత్రులకు ఆపన్నహస్తం.క్వింటా బియ్యం అందజేసినతోటి మిత్రులకు ఆపద వచ్చినప్పుడు ‘మేమున్నాం’ అంటూ అండగా నిలుస్తున్నారు మండలం లోని పెద్దకొడపాక గ్రామ పాఠశాలలో 1996–97లో చదువుకున్న విద్యార్థులు. గత 20 ఏళ్లుగా తమతో చదువుకున్న మిత్రులు ఎవరైనా ఆపదలో ఉంటే తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.ఇందులో భాగంగా తమ తోటి మిత్రురాలు ఏదుల శ్రీలత తండ్రి ఇటీవల అకాల మరణం చెందడంతో ఆమె కుటుంబాన్ని మిత్రులంతా కలిసి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కుటుంబానికి అండగా ఉంటాం అని తమ వంతు సహాయంగా ఒక క్వింటా బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మిత్రుడు అక్షర దర్బార్ రిపోర్టర్ పరకాల విజయ్ మాట్లాడుతూ.. పాఠశాలలో కలిసి చదువుకున్న తమ మిత్రులందరికీ ఆపద సమయంలో అండగా నిలుస్తూ, ఒకరికి ఒకరం సహాయ సహకారాలు అందించుకుంటున్నామని తెలిపారు. మిత్రుల ఐక్యతను, సేవా భావాన్ని గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు ఆర్ ఎం పి డాక్టర్ శ్రీనివాస్ శంకర్ కిరణ్ కుమారస్వామి రజనీకాంత్ భాస్కర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper