థర్మల్ పవర్ ప్లాంట్ల కాలుష్య నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు :- రాజ్యసభలో ఎంపీ మేడా రఘునాధ రెడ్డి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లాఢిల్లీలోగురువారంరాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గిం చేందుకు, పర్యావరణ పరిరక్షణ ప్రజారోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పలు కఠిన చర్యలను అమలు చేస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో తెలిపారు.కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, విస్తరణ ప్రాజెక్టులకు EIA నివేదికతో పాటు ముందస్తు పర్యావరణ అనుమతి తప్పని సరి అని ఆయన తెలిపారు.SPCBలు, PCCలు పరిశ్రమలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తు న్నాయి.అధిక కాలుష్య పరిశ్రమలకు OCEMS వ్యవస్థను తప్పనిసరి చేసి, ఉద్గారాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.SO₂ ఉద్గారాల నియంత్రణకు కొత్త నిబంధనలు అమల్లో ఉన్నాయి.కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో ప్రత్యేక ఛెస్ట్ క్లినిక్‌ల ఏర్పాటు కోసం మార్గదర్శకాలు జారీ చేశారు.పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత అంశాలపై రాజ్యసభలో ప్రజల తరఫున ప్రశ్నను లేవనెత్తిన ఎంపీ మేడా రఘునాధ రెడ్డి కి కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమాధానం ఇవ్వడం విశేషం.