దగ్గుబాటి పురందేశ్వరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన వీరన్న చౌదరి

September 11, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ సెప్టెంబర్ 11 3 వరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీకి, దేశానికి అందిస్తున్న విశిష్ట సేవలకు, వరుసగా లభిస్తున్న కీలక బాధ్యతలకు హృదయపూర్వక అభినందనలు. గత రెండు సంవత్సరాలుగా పార్లమెంటరీ మహిళా కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ మహిళా సాధికారత అంశాలపై సమర్థవంతంగా పనిచేసిన పురందేశ్వరికి ఇటీవల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తాజాగా బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించడం గర్వకారణం, ఇది ఆమె సుదీర్ఘ రాజకీయ అనుభవానికి, పార్టీ పట్ల అంకితభావానికి నిదర్శనం. 2014 నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2015లో కూడా మహిళా మోర్చా ఇన్ చార్జిగా, 2014లో రాజంపేట, 2019లో విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా సమస్యలపై నిబద్ధత చాటారు, అనంతరం 2020-2023 వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఇన్ చార్జిగా, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూటమి విజయానికి నాయకత్వం వహించి పార్టీని బలోపేతం చేశారు. అనుభవం, అంకితభావం, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో వరుసగా కీలక బాధ్యతలు అందుకుంటున్న దగ్గుబాటి పురందేశ్వరికి మరోసారి అభినందనలు, ఆమె నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతమై దేశ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను – నీరుకొండ వీరన చౌదరి, బీజేపీ, రాజానగరం

🌐 Select Language:
📰 ePaper