దేశవ్యాప్త కెమిస్టుల బంద్‌కు ఎల్కతుర్తిలో సంపూర్ణ మద్దతు…
కెమిస్ట్ డ్రగ్గిస్ట్ మండల అధ్యక్షులు గోడిశాల కిషన్, నందనం రవి
జనం న్యూస్ మే 20 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన 24 గంటల దేశవ్యాప్త బంద్‌లో భాగంగా మండలంలోని మెడికల్ దుకాణాలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా బంద్ నిర్వహించాయి.ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గోడిశాల కిషన్, నందనం రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలను నియంత్రించాలని, భారీ డిస్కౌంట్ల పేరుతో నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆన్లైన్ విక్రయాల ప్రభావంతో చిన్న మెడికల్ షాపులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కెమిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ బంద్ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న వ్యాపారులను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని మెడికల్ షాపుల యజమానులు ఐక్యంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో జనగాని ప్రవీణ్, గొడిశాల కార్తీక్, తిరుపతి, చిర్ర ఉదయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.