ద్విచక్ర వాహనాల చోరీల నివారణకు ముందు జాగ్రత్తలు తెలిపిన కమిషనర్ ఎన్. శ్వేత ఐపిఎస్*

August 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ, జిల్లా వాహనాలు చోరీలకు గురికాకుండా ఉండేందుకు వాహన యజమానులు అప్రమంతంగా ఉండాలని వరంగల్ కమీషనర్ ఎన్ . శ్వేత ఐ పీ ఎస్ మంగళ వారం ఒక ప్రకటనలో వివరించారు. వాహనాన్ని ఎల్లప్పుడూ స్టీరింగ్ లాక్, హ్యాండిల్ లాక్, అవసరమైతే డిస్క్ లాక్, చైన్ లాక్ వేసి పార్కింగ్ చేయాలని సూచించారు.రాత్రి వేళల్లో వాహనాలను సీసీ కెమెరాల వెలుతురు ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలన్నారు.వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ పరికరం లేదా యాంటీ-థెప్ట్ అలారం లాంటివి అమర్చుకోవాలన్నారు.వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్ సీ ), ఇన్సూరెన్స్, ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ వంటి వివరాలను భద్రంగా ఉంచుకోవాలన్నారు. అనుమానాస్పదంగా వాహనాల చుట్టూ తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్-100, 112 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.వాహనం చోరీకి గురైనట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసే ముందు వాహనం పత్రాలు, యాజమాన్య వివరాలతో పాటు పోలీసు రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు…..

🌐 Select Language:
📰 ePaper