సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి-ఎస్సై సతీష్

August 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ -ఆగస్టు 5- నాగార్జునసాగర్ టౌన్-సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించాలని ఆన్ లైన్ మోసాలు మరియు సైబర్ నేరాల పట్ల విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని విజయపురి టౌన్ ఎస్సై సతీష్ పిలుపునిచ్చారు, నాగార్జునసాగర్ హిల్ కాలనీలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ పై ప్రత్యేక అవగాహన సదస్సును బుధవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు, సోషల్ మీడియా ఆన్లైన్ పేమెంట్, లాటరీలు, పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో వచ్చే మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాట్సప్ ఎస్ఎంఎస్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్ లో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంక్ ఖాతా వివరాలు పిన్, ఓటీపీ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని, సోషల్ మీడియా ఖాతాలలో అపరిచిత వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్లను స్వీకరించవద్దని, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేయకూడదని విద్యార్థులకు తెలిపారు. ఎవరన్నా సైబర్ మోసానికి గురైతే వెంటనే సమయం వృధా చేయకుండా ఉచిత సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ సతీష్ చంద్ర , సిహెచ్ వెంకటయ్య , గోపాలకృష్ణ , మెరీనా , సైదమ్మ , మాధురి , రవీందర్, జనార్ధన్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ జావేద్ ,నాగేందర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper