హర్ ఘర్ తిరంగా’పై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం
రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలి: బీజేపీ
జనం న్యూస్ ఆగస్టు 5 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా పై రాష్ట్రంలోని అన్ని మండలాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరగవలసిన విషయాలపై పూర్తిగా చర్చించారు. బీజేపీ సంఘటన మంత్రి శివప్రకాష్, బీజేపీ సంఘటన మంత్రి మధుకర్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అనేక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్, ప్రధాన కార్యదర్శులు రమేష్ నాయుడు, దయాకర్ రెడ్డి, మట్ట ప్రసాద్, కో కన్వీనర్లు సాయి లోకేష్, శివారెడ్డి, యువ మోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.