నకిలీ ఎరువులు అంటూ రైతులను కష్టాలు పెడుతున్న అధికారులు*

August 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 05 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎరువుల షాపులను వదిలి రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ షాపులు నకిలీ రిజిస్ట్రేషన్లు పెట్టుకున్నా వారిపై చర్యలు తీసుకోకుండా రైతులని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్న జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి .గంగాధర్, తెలిపారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో రైతు ఉప్పరి మోహన్ సాగర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇంటిపై దాడులు చేయడం చాలా బాధాకరమైన సంఘటన. దీనిపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి.గంగాధర్ మా టి ఆర్ పి పార్టీ తరఫున రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అన్న పదాన్ని తుంగలో తొక్కిన గద్వాల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. నకిలీ ఎరువులు అని ఎలాంటి ఆధారాలు లేకుండా స్వచ్ఛందంగా అధికారులు చేసిన నిర్వాకం చాలా దురదృష్టమని భావించారు. ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని లేకపోతే ఎంత దూరమైనా వెళ్తామని తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఎరువుల అమ్ముతున్న షాపుల పైన డీలర్ల పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి. గంగాధర్ వివరించారు.రైతు వివరాల ప్రకారం రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామం ఆదర్శ రైతు ఉప్పరి.మోహన్ సాగర్, పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 100 ఎకరాలకు పైగా భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ముందస్తుగా జూలై 8న వనపర్తి జిల్లా కొత్తకోట లోని శ్రీరామ ట్రేడర్స్ నుంచి ఒక్కో డిఏపి బస్తాను రూ.1,550 చొప్పున మొత్తం రూ.2,82,500 ఇచ్చి కొనుగోలు చేసి తన సొంత ఇంట్లో నిల్వ ఉంచుకున్నాడు.ఎవరో ఇచ్చిన సమాచారం మేరకు గద్వాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డిఏఓ) వీరప్ప తన సిబ్బందితో కలిసి రైతు ఇంటిపై దాడి నిర్వహించి డీఏపీ నకిలీ ఎరువులంటూ 47 డిఏపి బస్తాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. రైతులను ఇబ్బంది పెడితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహించేది లేదు అంటున్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్. తెలిపారు.ఈ మధ్యకాలంలో నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు అంటూ కలకలం రేపుతున్న జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యవసాయ అధికారులు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు. షాపులపై ఇంతవరకు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు ఎవరో సమాచారం ఇచ్చి నకిలీ ఎరువులు అంటూ చెప్పిన మాటలు పట్టుకొని రైతును ముప్పు తిప్పలు పెడుతున్నా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తూనే ఉన్నారు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. అధిక రేట్లకు ఎరువులు అమ్ముతున్నారు. అని వారి మాటలు వినని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి .గంగాధర్ తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper