పెట్రోల్,డీజిల్ పెంపు పై నిరసన

May 16, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే(16) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై మూడు రూపాయలు పెంచడంతో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు పై ఆటోకు తాళ్లు కట్టి రోడ్డుపై లాగి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపినారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం డీజిల్,పెట్రోల్ పై లీడర్ కు మూడు రూపాయలు పెంచి సామాన్యులపై పేను భారం మోపిందని అన్నారు. ధరలు పెరగడం వల్ల నిత్యవసర వస్తువులపై అధిక ధరలు పెరిగి జీవనం కృంగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండగాని రాములు గౌడ్, మల్యాల రాములు,సోమేశ్ శ్రీనివాస్,లక్ష్మయ్య,మల్లేష్ సింహాద్రి,రమేష్,దాసు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper