పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గించాలి.

జనం న్యూస్ మే 18 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారు ఇచ్చిన పిలుపుమేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల హెడ్ క్వార్టర్ అయినా గేట్ సెంటర్ సెంట్రల్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడనుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి వైయస్సార్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రభుత్వం పెంచిన పెట్రోల్-డీజిల్ ధరలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని నినాదించారు అనంతరం కాట్రేనికోన తాసిల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైసీపీ శ్రేణులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముమ్మడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ ,సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ , ఎస్ ఈ సి మెంబర్ కాశి బాలాముణి కుమారి ,రాష్ట్ర పార్టీ ప్రచార విభాగం కార్యదర్శి వల్లభుని దొరబాబు ,రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ కుమార్ , జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ , జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు గంటి వెంకట సుధాకర్,వైసిపి మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ,రాష్ట్ర నాయకులు ఏడిద సుబ్బు, మండల మహిళా అధ్యక్షురాలు మోకా చంద్ర నాగరత్నం,మండల పరిషత్ అధ్యక్షులు కొలాటి సత్యం ,కోలా బాబ్జీ గారు,జడ్పిటిసి నేల కిషోర్ కుమార్ , ముమ్మిడివరం నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నడింపల్లి సందీప్ వర్మ ,సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు పందిరిపల్లి రాజేష్ , నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పల్లా వీరబాబు ,పల్లంకురు మాజీ సర్పంచ్ నాతి అలివేణి ,పల్లం మాజీ సర్పంచ్ మల్లాడి వీర బాబ్జి , సమసాను పాండురంగ తదితరులు పాల్గొన్నారు.