ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఎస్సై పరమేశ్వర్
జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో సర్పంచ్ మారబోయిన ప్రభాకర్, గ్రామ పెద్ద కౌటం లక్ష్మీనారాయణ మరియు గ్రామ వార్డు సభ్యుల సహకారంతో రూ.25 వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల కోసం ఎస్సై పరమేష్ సమక్షంలో సీసీ కెమెరాల డెమోన్స్ట్రేషన్ నిర్వహించారు. అనంతరం ఎస్సై పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పెద్దలు ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రసాద్ పాల్గొన్నారు….