భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం.. వ్యక్తి ఆత్మహత్య

July 8, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, జులై 8, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం: మండలంలో ని మేడిపల్లి గ్రామానికి చెందిన కాశబోయిన అరుణ్ (35), చిన్న గంగారం కుమారుడు, తన స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. స్థానిక సమాచారం ప్రకారం, అరుణ్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమారు పది రోజుల క్రితం అరుణ్‌కు అతని భార్య రోజాతో చిన్నపాటి కుటుంబ కలహం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో రోజా తన ముగ్గురు పిల్లలతో కలిసి తన పుట్టినిల్లు అయిన మెండోరా గ్రామానికి వెళ్లి అప్పటి నుంచి అక్కడే ఉంటున్నట్లు సమాచారం.భార్య, పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన అరుణ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో జూలై 7, 2026 సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

🌐 Select Language:
📰 ePaper