ఫ్లెక్సీ లకు ఆవులకు, కుక్కలకు,చెత్తాచెదారానికి నిలయంగా మారిన డివైడర్

July 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 03-07-26నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసినటువంటి డివైడర్ నేడు ఫ్లెక్సీ లకు ఆవులకు, కుక్కలకు అడ్డాగా మారింది. జిల్లాలోనే ఇంత పెద్ద డివైడర్ ఎక్కడ లేదు అటువంటి డివైడర్ మీద ఏదైనా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే చెట్లను పెంచితే పర్యా వరణ పరిరక్షణ కొంతవరకైనా అభివృద్ధి చెందుతుందని, పాదచారులకు స్వచ్ఛమైన గాలి ఇస్తుందని పంచాయతీ సిబ్బందికి తెలియని విషయ మేమీ కాదు, కానీ గతంలో ఫ్లెక్సీ కి నెలకి 1500 రూపాయలు చొప్పున పంచాయతీ వారు వసూలు చేశారు. ప్రస్తుతం వాటి వలన ఆదాయం లేకపోయినా జన్మదిన వేడుకలకు అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా కూడలి నుండి బస్టాండ్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ డివైడర్ కేవలం ఫ్లెక్సీలకే పరిమితమైందని మండల వాసులు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పర్యావర ణాన్ని కాపాడే మొక్కలను డివైడర్ పై పెంచవలసిందిగా కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper